Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 September 2025, 7:53 pm Posted by : ramakrishna

బోధన్ ఆర్టీసీ డిపోలో యాత్ర దానం కార్యక్రమానికి శ్రీకారం

బతుకమ్మ, బోధన్: టి.జి.ఎస్.ఆర్.టి.సి. ఎండి వీసీ సజ్జనర్ ఆదేశాల మేరకు “మానవ సంబంధాల వారధి – యాత్ర దానం” పేరుతో ఆర్టీసీ నూతన పథకాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా నిరాశ్రయులు, వృద్ధులు, వికలాంగులు, విద్యార్థులు, పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు, విహారయాత్రలకు వెళ్లలేని వారికి ఉచిత రవాణా కల్పించనున్నారు. బోధన్ డిపో మేనేజర్ కార్యచరణ రూపొందిస్తూ, సమాజంలోని స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీవోలు, లయన్స్ క్లబ్, ఎన్నారైలు, కార్పొరేట్ సంస్థలు తదితరులు ఈ “యాత్ర దానం – గిఫ్ట్ ఎ బస్ ట్రావెల్” పథకం ద్వారా సహకరించవచ్చని కోరారు. పుట్టినరోజులు, వివాహాలు వంటి శుభకార్యాల సందర్భంలో విరాళాల రూపంలో ఈ యాత్రదానం చేయవచ్చని పేర్కొన్నారు. ఇక మరిన్ని వివరాలకు 9959226001 / 7382843670 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు.