బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలంలోని తిమ్మాపూర్ మోక్షనంద బుద్ధ విహార లో సోమవారం యశోబుద్ధ ఫౌండేషన్ బుద్దిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా – (తెలంగాణ) క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోక్షానంద బుద్ధ విహార్ బంతె యశోద ఫౌండేషన్ ఫౌండర్ పబ్బ శంకర్ మాట్లాడుతూ భారత దేశ ప్రజలు తథాగదా బుద్ధుడి, మహనీయులు డా.బి.ఆర్ అంబెడ్కర్ ,మహాత్మా జ్యోతిరావుఫూలే ఆలోచన విధానంలో వారి అడుగు జడల్లో జీవన శైలి కొనసాగించాలని అన్నారు. యశోబుద్ధ సొసైటీ ఆఫ్ ఇండియా తెలంగాణ ఫౌండేషన్ వారి యొక్క సంకల్పం చాలా గొప్పదని తెలిపారు. వారు ఆశించిన విదంగా మహనీయుల ఆశయాలకు ఆలోచనలకు అనుగుణంగా నడుచుకుంటూ ముందుకు కొనసాగాలన్నారు. కార్యక్రమంలో మామిడి రవీందర్, బి. రత్నయ్య, భాస్కర్, రాజేందర్, గోవర్ధన్, అంబేద్కర్ యువజన సంఘం మోర్తాడ్ మండల అధ్యక్షుడు అంగులి మాలాజీ, రాజు, సామ్రాట్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.