Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 May 2025, 3:59 pm Posted by : ramakrishna

మెండోరా నూతన ఎస్ఐగా యాసిర్ అర్పాత్ బాధ్యతల స్వీకరణ

బతుకమ్మ,మెండోరా: మెండోరా పోలీస్ స్టేషన్ కు నూతన ఎస్సైగా యాసిర్ అర్పాత్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతల, పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమాలు, జూదం, అక్రమ మద్యం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు . పోలీసు సిబ్బంది నూతన ఎస్ఐకి శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకు ముందు  పనిచేస్తున్న ఎస్ఐ జి నారాయణ విఆర్ కు బదిలీపై వెళ్ళారు.