Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 September 2025, 9:05 pm Posted by : ramakrishna

పోలీస్ కమిషనర్ ను  కలిసిన యమన్ కుటుంబ సభ్యులు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ఢిల్లీ పోలీసులు తన కుమారుడిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నా కుమారుడికి ఉగ్ర వాదుల తో సంబంధాలు లేవు అని యమన్ తల్లి నజీమ్ సుల్తానా, సోదరుడు ఉమర్ లు అన్నారు. ఇటివల బోదన్ కు చెందిన యమన్ ను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం యమన్ కుటుంబ సభ్యులు నిజామాబాద్ పోలిస్ కమీషనర్ సాయి చైతన్యను కలిసారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతు.. యమన్ సోషల్ మీడియాను తప్పుగా ఉపయోగించాడు అని అన్నారు. తమ ఇంటిలో ఢిల్లీ పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు అన్నారు. యమన్ డ్యానిష్ తో సోషల్ మీడియా ప్లాట్ పాంలో మాట్లాడారు. డ్యానిష్ బ్యాక్ గ్రౌండ్ తెలియదు అని తెలిపారు. మా కుటుంబం పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఎయిర్ రైఫిల్  గన్ కు లైసెన్స్ ఉందన్నారు. ఢిల్లీ పోలీసులు వచ్చి తనిఖీలు చేసారని, తమకు న్యాయస్థానం పై నమ్మకం ఉందన్నారు. యమన్  బీ ఫార్మసీ చదువుతున్నాడని అతనికి ఇతరులు ఎవ్వరితో గోడవ పడేవాడు కాదని తెలిపారు.