బతుకమ్మ నిజామాబాద్ సిటీ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో నిర్మిస్తున్న సైన్స్ బిల్డింగ్ నిర్మాణ నాణ్యతా ప్రమాణాలను రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి శనివారం పరిశీలించారు. అనంతరం రిజిస్ట్రార్ ప్రభుత్వ ఏజెన్సీ తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్, విమెన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డిప్యూటీ ఇంజనీర్ సాయన్న ను నిర్మాణ పనులు ప్రభుత్వ నాణ్యతా ప్రమాణాలను అనుసరించి పూర్తి చేసి సకాలంలో బిల్డింగ్ ను విశ్వవిద్యాలయానికి అందించాలని కోరారు. ఈ తనిఖీ ల్లో విశ్వవిద్యాలయ అసిస్టెంట్ ఇంజనీర్ వినోద్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.