Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 January 2026, 8:40 pm Posted by : ramakrishna

నిజామాబాద్ రూరల్‌లో ఎక్స్ యూవీ 7ఎక్స్ఓ గ్రాండ్ లాంచ్

. . . ఆవిష్కరించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి

 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :

 

డిచ్‌పల్లి మండలం బర్దిపూర్ గ్రామ శివారులో మహీంద్రా సంస్థ తాజా మోడల్ ఎక్స్ యూవీ 7ఎక్స్ఓ కారును ఘనంగా ఆవిష్కరించారు. మహీంద్రా నిజామాబాద్ షోరూం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి కారును లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇండియన్ కంపెనీగా ప్రపంచ మార్కెట్లో మహీంద్రా తనదైన ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకుందని, కాలానుగుణంగా నూతన సాంకేతికతను వినియోగదారులకు అందిస్తూ నిరంతరం ముందంజలో నిలుస్తోందన్నారు. అందుబాటు ధరలో భద్రత, వినియోగ ప్రయోజనం, ఫీచర్లు అన్నీ కలబోసిన వాహనాన్ని ప్రజలు ఎక్కువగా ఆశిస్తారని, ఎక్స్ యూవీ 7ఎక్స్ఓ ఆ అంచనాలను అందుకునే మోడల్ అని అభిప్రాయపడ్డారు.

XUV7XO Grand Launch in Nizamabad Rural
XUV7XO Grand Launch in Nizamabad Rural
XUV7XO Grand Launch in Nizamabad Rural

తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా ఆనంద్ మహీంద్రా నియామకాన్ని ఈ సందర్భంగా ఆయన సంతోషంగా అభినందించారు. మహీంద్రా సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్పా గంగారెడ్డి, పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్, పిసిసి ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మునిపల్లి చిన్న సాయిరెడ్డి, రూరల్ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు వాసు బాబు, సర్పంచ్ గంగారెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గంగాధర్, నాయకులు పోలసాని శ్రీనివాస్, రామచంద్ర గౌడ్, భోజన్న, కాంగ్రెస్ కార్యకర్తలు, మహీంద్రా షోరూం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

 

XUV7XO Grand Launch in Nizamabad Rural
XUV7XO Grand Launch in Nizamabad Rural