కామారెడ్డి, బతుకమ్మ :
కామారెడ్డి మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందు ప్రియా రెడ్డి తనపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన వ్యవహరంలో మాజీ మంత్రి, ప్రభుత్వ సలదారు షబ్బిర్ ఆలీ, ఆయన తనయుడు ఇలియాస్ తో పాటు వారి అనుచరులపై జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ గా పనిచేశాను. ప్రస్తుతం మహిళా కాంగ్రెస్ నాయకురాలిగా క్రియాశీలకంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను. దీనిని సహించలేక కొంతమంది వక్తులు పక్కా ప్రణాళిక, పథకం ప్రకారం దుష్ప్రచారం చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. గత ఏడాది షబ్బిర్ ఆలీ అనుచరుడు సోషల్ మీడియాలో దుష్ర్పచారం చేయడంతో ఫిర్యాదు చేయగా ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇందులో షబ్బీర్ అలీ అనుచరుడు పర్వేజ్ అహ్మద్, షేర్ ముక్తార్ కామారెడ్డి జిల్లా ఫేస్ బుక్ అడ్మిన్ వీళ్ళిద్దరితో పాటు ఇర్ఫాన్, కేఫ్ లో నందు నాపై అసత్య ప్రచారాలు, అసాంఘిక కార్యకలాపాలు అని నిందలు వేస్తూ వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ నన్ను మనోవేదనకు గురి చేస్తున్నారన్నారు. శాంతియుతంగా ఉన్న కామారెడ్డిలో ఒక హిందూ మహిళా గురించి అసభ్య పదజాలం వాడినందుకు గాను ఇరువర్గాల మధ్య ఘర్షణలు ఏర్పడే అవకాశాలున్నాయన్నారు. మహమ్మద్ పర్వేజ్ అహ్మద్ అనే వ్యక్తి ప్రజలలో, కార్యకర్తలతో నాకు పోలీస్ శాఖ లో మంచి సంబంధాలున్నాయని నాకు షబ్బీర్ అలీ కుటుంబ సభ్యుల అండదండలున్నాయని, నేనేం చేసిన ఆయన ఆదేశాల మేరకే చేస్తున్నానని బహిరంగంగా ప్రకటించుకుంటున్నాడు. కావున ఇటువంటి సంఘ విద్రోహశక్తులను, మతసామరస్యాన్ని దెబ్బ తీసే వ్యక్తులను కఠినంగా శిక్షించి, చట్టరీత్యా వారిపై తగిన చర్యలు తీసుకొని మహిళలకు న్యాయం చేయాలని, వారి నుండి తనకు రక్షణ కల్పించాలని కోరారు.
