బతుకమ్మ, భిక్కనూరు: ఫీజు రీలంబర్స్మెంట్ ను వెంటనేవిడుదల చేయాలని డిమాండ్ చేస్తూ టీజీవీపీ ఆధ్వర్యంలో భిక్కనూరు మండలకేంద్రంలో బుధవారం చౌరస్తా దగ్గర పాత హైవేపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా టిజివిబి అధ్యక్షుడు గంధం సంజయ్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి లక్ష 91 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని, రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నియమించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాస్తారోకోలు, ధర్నాలు చేస్తామన్నారు . ఈ కార్యక్రమంలో ఎండి సమీర్ నిశాంత్ సందీప్ కళాశాల విద్యార్థులు ఉన్నారు.
