నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నగరంలోని ధర్నాచౌక్ లో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో వికలాంగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వికలాంగుల పోరాట సమితి అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రూ.6 వేల పెన్షన్ పెంచుతామని ఇచ్చిన హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వికలాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని, వికలాంగులకు 2016 చట్టం అమలు చేయాలని, వికలాంగుల సంక్షేమ శాఖ స్వతంత్ర స్వయం ప్రతిపక్తి శాఖ ఏర్పాటు చేయానలి డిమాండ్ చేశారు. రాస్తారోకోతో వాహనాల రాకపొకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
