ఘనంగా కుస్తీ పోటీలు

మహారాష్ట్ర, బిచ్కుంద నుంచి తరలివచ్చిన మల్లయోధులు   బతుకమ్మ : నాగిరెడ్డిపేట : ఉగాది, శ్రీరామనవమి పండుగలను పురస్కరించుకొని మండలంలోని జలాల్ పూర్ గ్రామంలో బుధవారం మత్తడి పోచమ్మ ఆలయం వద్ద ఘనంగా కుస్తీ పోటీలను నిర్వహించారు. ప్రాచీన సాంప్రదాయాలకు అతీతంగా ఈ కుస్తీ పోటీలు ఎంతో సంబరంగా నిర్వహించారు. గ్రామ పెద్దల ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు ఏర్పాటు చేయగా, ఈ కుస్తీ పోటీలను తిలకించేందుకు మండలంలోని వివిధ గ్రామాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కుస్తీ పోటీలలో మహారాష్ట్ర బిచ్కుంద ప్రాంతాలకు...