Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 April 2025, 9:34 pm Posted by : ramakrishna

ఘనంగా కుస్తీ పోటీలు

  • మహారాష్ట్ర, బిచ్కుంద నుంచి తరలివచ్చిన మల్లయోధులు

 

బతుకమ్మ : నాగిరెడ్డిపేట : ఉగాది, శ్రీరామనవమి పండుగలను పురస్కరించుకొని మండలంలోని జలాల్ పూర్ గ్రామంలో బుధవారం మత్తడి పోచమ్మ ఆలయం వద్ద ఘనంగా కుస్తీ పోటీలను నిర్వహించారు. ప్రాచీన సాంప్రదాయాలకు అతీతంగా ఈ కుస్తీ పోటీలు ఎంతో సంబరంగా నిర్వహించారు. గ్రామ పెద్దల ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు ఏర్పాటు చేయగా, ఈ కుస్తీ పోటీలను తిలకించేందుకు మండలంలోని వివిధ గ్రామాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కుస్తీ పోటీలలో మహారాష్ట్ర బిచ్కుంద ప్రాంతాలకు చెందిన మల్ల యోధులు ఆసక్తి చూపించారు. కుస్తీ పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి నగదు బహుమతి తో ఘనంగా సత్కరించారు. చిట్ట చివరి కుస్తీ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి 3500 రూపాయలు నగదు బహుమతితో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ ధారబోయిన కృష్ణ, నాయకులు గోపాల్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Wrestling competitions in grand style