చిక్కడపల్లిలో కుస్తీ పోటీలు…

  రుద్రూర్, బతుకమ్మ :   మహాశివరాత్రిని పురస్కరించుకుని రుద్రూర్ మండలంలోని చిక్కడపల్లి గ్రామంలో సోమవారం కుస్తీ పోటీలు నిర్వహించారు. మాజీ సర్పంచ్ కిషన్ రావు పటేల్ జ్ఞాపకార్థం ప్రతి ఏటా వారి కుటుంబ సభ్యులు కుస్తీ పోటీలను నిర్వహిస్తున్నారు. గ్రామ శివారులో నిర్వహించిన కుస్తీ పోటీలు మధ్యాహ్నం ప్రారంభమై సాయంత్రం ముగిశాయి. ఈ కుస్తీ పోటీలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కుస్తీ పోటీల్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన మల్లయోధులు పాల్గొని ప్రతిభ చాటారు. పోటీలోని విజేతలకు...