Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 February 2026, 7:38 pm Posted by : ramakrishna

చిక్కడపల్లిలో కుస్తీ పోటీలు…

 

రుద్రూర్, బతుకమ్మ :

 

మహాశివరాత్రిని పురస్కరించుకుని రుద్రూర్ మండలంలోని చిక్కడపల్లి గ్రామంలో సోమవారం కుస్తీ పోటీలు నిర్వహించారు. మాజీ సర్పంచ్ కిషన్ రావు పటేల్ జ్ఞాపకార్థం ప్రతి ఏటా వారి కుటుంబ సభ్యులు కుస్తీ పోటీలను నిర్వహిస్తున్నారు. గ్రామ శివారులో నిర్వహించిన కుస్తీ పోటీలు మధ్యాహ్నం ప్రారంభమై సాయంత్రం ముగిశాయి. ఈ కుస్తీ పోటీలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కుస్తీ పోటీల్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన మల్లయోధులు పాల్గొని ప్రతిభ చాటారు. పోటీలోని విజేతలకు నిర్వాహకులు నగదు బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో సంజీవ్ పటేల్, సర్పంచ్ మచ్కూరి రమేష్, ఉపసర్పంచ్ పిట్ల కళ్యాణ్, మాజీ సర్పంచ్ వేముల సురేష్, మాజీ ఉపసర్పంచ్ చింతల గంగాధర్, వేముల రమేష్, నాగనాథ్, జెల్ల సాయిలు, గుడిసె పోశెట్టి, వేముల కరణ్, మచ్కూరి చిన్న హన్మంతు, పిట్ల వీరేషం, సంగప్ప, నక్క సాయిలు తదితరులు పాల్గొన్నారు.