అంబంలో కుస్తీ పోటీలు
రుద్రూర్, బతుకమ్మ: హనుమాన్ జన్మోత్సవాన్ని పురస్కరించుకొని రుద్రూర్ మండలంలోని అంబం (ఆర్) గ్రామంలో శనివారం సాయంత్రం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో కుస్తీ పోటీలను నిర్వహించారు. ఈ కుస్తీ పోటీలలో తలపడేందుకు వివిధ ప్రాంతాల నుండి మల్లాయోధులు తరలివచ్చి కుస్తీ పోటీలలో పాల్గొన్నారు. కుస్తీ పోటీలలో గెలుపొందిన మల్లాయోధులకు నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.