Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 July 2025, 3:18 pm Posted by : ramakrishna

వామ్మో కుక్కలు..

  • కుక్కల బెడద తీరేడెన్నడో..?

 

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని జేయన్సీ కాలనీ, బస్టాండ్ ప్రాంగణం, అంగడి బజార్ వద్ద వీధి కుక్కల బెడద తీవ్రమైంది. కుక్కల సంచారం కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. వీధుల్లో ఎక్కడపడితే అక్కడ ఉండే కుక్కలు దారిన పోయే వారిపై దాడి చేస్తున్నాయి. వాహనాలపై వెళ్లే వారిని సైతం గుంపులుగా వెంబడిస్తున్నాయి. పాఠశాలలకు వెళ్లే పిల్లలు, వృద్ధులు మరింత బెంబేలెత్తుతున్నారు. గతంలో ఆయా మున్సిపాలిటీల్లో కుక్కలను బంధించి అటవీ ప్రాంతాల్లో విడిచిపెట్టేవారు. ప్రస్తుతం అలాంటి చర్యలు కనిపించకపోవడంతో కుక్కల సంతతి సైతం రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కల బెడదను నివారించాలని గ్రామస్తులు కోరుతున్నారు.