పూజలు.. బిల్లులు.. లంచాలు
. ఏసీబీకి పట్టుబడిన శ్రీనివాస్ శర్మ నిర్వాకం . విధులకు హాజరుకాకున్నా ప్రధాన సెక్షన్ ల బాధ్యతలు . శర్మకు సహకరించిన అధికారులపై చర్యలకు డిమాండ్ జిల్లాపరిషత్, బతుకమ్మ: పూజలు.. బిల్లులు.. లంచాలు.. ఒకదానితో ఒకదానికి సంబంధం లేకున్నా మూడింటినీ చక్కగా సమన్వయం చేసుకుంటూ టైమ్ బాగున్నప్పుడే మూడురాళ్లు వెనకేసుకోవాలనుకున్నాడు పంచాయతీరాజ్ సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ శర్మ. అందుకోసం ముఖ్య ప్రజాప్రతినిధులను, శాఖ ఉన్నతాధికారులను, బడా కాంట్రాక్టర్లను మచ్చిక చేసుకుని ముందుకుసాగుతూ చివరకు ఏసీబీ వలకు చిక్కాడు. పంచాయతీరాజ్ డివిజన్ కార్యాలయంలో డిప్యుటేషన్ పై...