ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయిలోని తిర్మాన్ పల్లి గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో భక్తులు ఆదివారం పూజలు నిర్వహించి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరినట్లు తెలిపారు. తిర్మన్ పల్లి గ్రామంలో వెలిసిన ఎల్లమ్మ మందిరంలో గత సంవత్సరాలుగా లక్షలాదిమంది పూజలు నిర్వహిస్తూ పండుగలు జరుపుకుంటారని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. దీనికి ప్రభుత్వం స్పందించి ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు.