అధ్వాన్నంగా నర్సరీలు

బతుకమ్మ, మోర్తాడ్: పచ్చదనం పెంచడంతోపాటు పరిసరాలు ఆహ్లదకరంగా ఉండాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం హరితహారం ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దీని పేరును వన మహోత్సవంగా మార్చింది. వన మహోత్సవం విజయవంతం కావాలంటే నర్సరీల నిర్వాహణ సక్రమంగా ఉండాలి. ఇల్లు వాకిలి చూసి ఇల్లాలు ఎలాంటిదో చెప్పొచ్చు అన్న సామెతగా నర్సరీలను చూసి వన మహోత్సవం ఏ స్థాయిలో ఉందో చెప్పవచ్చని పలువూరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి గ్రామంలో నర్సరీ.. ఏ గ్రామం నర్సరీలో పెంచిన మొక్కలను ఆ ఊరిలోని నాటాలని...