బతుకమ్మ, మోర్తాడ్: పచ్చదనం పెంచడంతోపాటు పరిసరాలు ఆహ్లదకరంగా ఉండాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం హరితహారం ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దీని పేరును వన మహోత్సవంగా మార్చింది. వన మహోత్సవం విజయవంతం కావాలంటే నర్సరీల నిర్వాహణ సక్రమంగా ఉండాలి. ఇల్లు వాకిలి చూసి ఇల్లాలు ఎలాంటిదో చెప్పొచ్చు అన్న సామెతగా నర్సరీలను చూసి వన మహోత్సవం ఏ స్థాయిలో ఉందో చెప్పవచ్చని పలువూరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి గ్రామంలో నర్సరీ..
ఏ గ్రామం నర్సరీలో పెంచిన మొక్కలను ఆ ఊరిలోని నాటాలని అధికారులు నిర్ణయించారు. గతంలో కొన్ని గ్రామాలను కలిపి ఒకే నర్సరీలో ఉంచడంలో ఇతర పల్లెలకు వాటిని తరలించడంలో రవాణా ఖర్చులు పెరిగిపోవడం. ఇతర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఊరూరా నర్సరీ ఏర్పాటుకు సంకల్పించింది పంచాయితీలకే నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. అవసరం మేర పెద్ద పంచాయితీల్లో ఎక్కువ చిన్న పంచాయితీల్లో తక్కువ మొక్కలను పెంచుతున్నారు.
పర్యవేక్షణ లేకపోవడం..
అధికారులు నర్సరీలో జరుగుతున్న పనుల విషయంలో పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడం. స్థానిక పంచాయితీ సిబ్బంది నర్సరీల వైపు వెళ్లకపోవడం. క్షేత్ర సహాయకులు ప్రతిరోజు వెళ్లకుండా నర్సరీ నిర్వాహకులకు వదిలివేయడంతో నర్సరీలో మొక్కలు సక్రమంగా పెరగకుండా పిచ్చి మొక్కలు, పచ్చగడ్డి దర్శనమిస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒక్క నర్సరీ నిర్వహణకు ప్రభుత్వం సుమారు రూ.50,000 నుంచి రూ.1,20,000 వరకు ఖర్చు చేస్తుంది. దీంతో లక్షల రూపాయల ప్రభుత్వ సొమ్ము వృధా అవుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలో 530 గ్రామపంచాయితీలో (2024 -25 ) సంవత్సరంలో 19.61 లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యం ఉంది. కానీ ఇప్పటి వరకు 16 లక్షల మొక్కలు నాటినట్లు అధికారుల గణాంకాలు తెలుపుతున్నాయి. ఉపాది హామీ పని దినాలు పూర్తి కావడంతో మొక్కలు నాటే కార్యక్రమాలు నిలిపివేయడం వల్ల ఇంకా 3.61 మొక్కలు నాట వలసి ఉంది. లక్షల మొక్కలు నర్సరీలో ఉండిపోవడంతో నర్సరీలు నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో నర్సరీ దాటకుండానే మొక్కలు ఎండిపోతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఒక మొక్కకు ప్రభుత్వం రూ.5 చెల్లిస్తుంది. అదే టేకు మొక్క అయితే రూ. 8 చెల్లిస్తుంది. ఒక నర్సరీలో పదివేల మొక్కలు పెంచితే 2-3 గ్రీన్ మ్యాట్ లు, అదే పెద్ద నర్సరీకి 20వేల మొక్కలు పెంచితే 5-6 గ్రీన్ మ్యాన్ అందిస్తుంది ప్రభుత్వం. ఒక గ్రీన్ మ్యాట్ విలువ రూ.3000 వరకు ఉంటుంది. చిన్న నర్సరీకి 9,000 వరకు గ్రీన్ మ్యాట్లు, పెద్ద నర్సరీ రూ.18 వేల వరకు ఖర్చవుతుంది. వేల రూపాయల ఖర్చు చేసి నర్సరీ నిర్వహణ పై నిర్లక్ష్యం వహిస్తున్నారని ఇప్పటికైనా నర్సరీల బాధ్యత సక్రమంగా నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. మోర్తాడ్ మండలంలో గతంలో ఒక గ్రామానికి చెందిన నర్సరీని మండల అధికారి సందర్శించి నర్సరీలో ఉన్న పిచ్చి మొక్కలను, గడ్డిని చూసి స్థానిక క్షేత్ర సహాయకుడి ని, మరో వ్యక్తికి చివాట్లు పెట్టిన వాళ్ల పద్ధతిలో మార్పు రాలేదనీ స్థానికులు తెలిపారు. ఒక గ్రామానికి చెందిన క్షేత్ర సహాయకుడు నర్సరీలో అడుగుపెట్టిన దాఖలాలు లేవనీ నర్సరీ నిర్వాహకులను అడిగి తెలుసుకోనీ చేతులు దులిపేస్తున్నాడనీ పలువురు పేర్కొన్నారు. చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి కనబడుతుందని పలువురు పేర్కొన్నారు.
నిర్లక్ష్యం చేయవద్దు..
సాయ గౌడ్, (జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి). నిజామాబాద్.
నర్సరీల నిర్వహణలో ఉన్న మొక్కలు వచ్చే సంవత్సరం కోసం కావున పెద్ద బ్యాగులకు వాటిని మార్చి మొక్కలను సంరక్షించాలి. ప్రతి గ్రామంలో ఉన్న ఉపాధి హామీ సిబ్బంది ప్రతిరోజు నర్సరీ సందర్శించి పరిశుభ్రంగా ఉంచాలని మొక్కలు ఎండిపోకుండా, పిచ్చి మొక్కలు, గడ్డి పెరగకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు.
