Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 September 2025, 8:01 pm Posted by : ramakrishna

ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ ఫార్మసిస్ట్ డే

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లోని ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ ఫార్మసిస్ట్ డే గురవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా లోని ఫార్మ సిస్టు లకు జిల్లా ఆయుష్ విభాగం ఇన్చార్జి డాక్టర్ జె గంగా దాస్, డాక్టర్ వెంకటేష్ ఆధ్వర్యంలో ఆయుష్ విభాగం ఫార్మ సిస్టులకు ఘనంగా సన్మానించారు. ఆయుష్ విభాగం ఫార్మ సి స్ట ల సేవలు మరుమలేనివని, అందరూ కలిసి కృషి చేస్తే ఆయుష్ వైద్యం పట్ల ప్రజలకు అవగాహన వస్తుందని తెలిపారు. ఆయుష్ విభాగం ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి న్యావానంది పురు షోత్తం మాట్లాడుతూ ఉన్నత అధికారుల సహాయంతో మేము ఉత్తమ సేవలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో  ఆయుష్ విభాగం ఫార్మ సిస్టులు వర లక్మీ, ఉమా ప్రసాద్, జయరాజ్, దనలక్ష్మీ, రమణ, నీరజ, రామనారని, రేఖ, పారామెడికల్ సిబ్బంది రమేష్, లవన్ పాల్గొన్నారు.

World Pharmacist Day under the auspices of the Department of AYUSH