Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 December 2024, 8:37 pm Posted by : ramakrishna

ఏర్గట్ల ఉన్నత పాఠశాలలో ప్రపంచ ధ్యాన దినోత్సవం

బతుకమ్మ,ఏర్గట్ల:అంతర్జాతీయ ధ్యాన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్గట్ల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ధ్యానం గొప్పతనం,  దానివల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు. మానసికంగాను శారీరకంగాను ధ్యానం ఎంతో మేలు చేస్తుందని ప్రతినిత్యం ఒక 15 నిమిషాలు ధ్యానం చేయడం వల్ల అనేక లాభాలు కలుగుతాయని ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. భారతదేశం ధ్యానానికి కేంద్రంగా ఉండి ప్రపంచ దేశాలను ఆకర్షిస్తుందని చాలామంది విదేశీయులు కూడా ఈ ధ్యానం చేయడం వల్ల అనేక లాభాలు పొందుతున్నారని, మానసిక ఒత్తిడిని తట్టుకొని ధైర్యంగా ముందుకు తీసుకు వెళ్లడానికి ధ్యానం చాలా ఉపయోగపడుతుందని,స్వామి వివేకానందా మొదలుకొని ఎందరో మహనీయులు ఈ ధ్యానాన్ని ఆచరించి వాళ్ళ జీవితాలను సుసంపన్నం చేసుకున్నారని తెలిపారు. విద్యార్థులు కూడా మానసిక ఒత్తిడిని తట్టుకోవాలంటే ధ్యానం తప్పకుండా చేయాలని, విద్యార్థుల చేత 15 నిమిషాలు ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణ చారి,ఉపాధ్యాయులు మునిరుద్దీన్,ప్రసాద్,పవన్, రాజశేఖర్ ప్రవీణ్ శర్మ, గంగాధర్,విజయ్,శ్రీనివాస్, నరేష్,సబిత పాల్గొన్నారు.