ఘనంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు
ఏర్గట్ల, బతుకమ్మ : నాగేంద్రనగర్ గ్రామంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. మాతృత్వానికి గౌరవం, శిశువుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ నిర్వహించిన ఈ వేడుకల్లో శ్రీమంతం, అన్నప్రాశన కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు సంప్రదాయబద్ధంగా శ్రీమంతం నిర్వహించి ఆశీర్వదించగా, చిన్నారులకు అన్నప్రాశన కార్యక్రమాన్ని ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. అనంతరం తల్లిపాల ప్రాముఖ్యతపై తల్లులు, గర్భిణీలకు అవగాహన కల్పించారు. పుట్టిన గంటలోపే శిశువుకు తల్లిపాలు అందించడం, తొలి ఆరు...