న్యాయ కళాశాలలో చట్టాల విశ్లేషణ విమోచన అంశంపై వర్క్ షాప్
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో న్యాయ కళాశాలలో సోమవారం జరిగిన వర్క్ షాప్ లో హైదరాబాద్ జిల్లా రిటైర్డ్ జడ్జ్ డా. డి. హేమంత్ కుమార్ రిసోర్స్ పర్సన్ గా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ హేమంత్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో పెడదోరణలు జరగకుండా చట్టాలు సహజ సూత్రాలను అందిస్తాయన్నారు. అధికారము, ధనము బంధుప్రీతి కి అతీతంగా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన కొనసాగాలని చట్టాలు సూచిస్తాయన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం కుల మత వర్గ వర్ణ తేడా లేకుండా చట్టం దృష్టిలో...