Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 August 2025, 6:12 pm Posted by : ramakrishna

న్యాయ కళాశాలలో చట్టాల విశ్లేషణ విమోచన అంశంపై వర్క్ షాప్

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో న్యాయ కళాశాలలో  సోమవారం జరిగిన వర్క్ షాప్ లో   హైదరాబాద్ జిల్లా రిటైర్డ్ జడ్జ్  డా. డి. హేమంత్ కుమార్ రిసోర్స్ పర్సన్ గా  హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని  ఉద్దేశించి  డాక్టర్ హేమంత్ కుమార్  మాట్లాడుతూ  సమాజంలో పెడదోరణలు జరగకుండా  చట్టాలు సహజ సూత్రాలను అందిస్తాయన్నారు. అధికారము, ధనము  బంధుప్రీతి కి అతీతంగా ప్రజాస్వామ్యబద్ధంగా  పరిపాలన కొనసాగాలని  చట్టాలు సూచిస్తాయన్నారు.  భారత రాజ్యాంగం ప్రకారం కుల మత  వర్గ వర్ణ తేడా లేకుండా  చట్టం దృష్టిలో అందరూ సమానమన్నారు. ఈ సందర్భంగా చట్టాల పై విశ్లేషణ తో పాటు ఏ సందర్భాలలో  చట్టాలు వివేచనకు గురవుతాయో తెలిపినారు. అనంతరం విద్యార్థులు  అడిగిన  వివిధ ప్రశ్నలకు వివరణాత్మకంగా సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో న్యాయ కళాశాల ప్రిన్సిపల్   డా. కే. ప్రసన్న రాణి,డాక్టర్ బి.స్రవంతి న్యాయ కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.