Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 November 2024, 6:04 pm Posted by : ramakrishna

ప్రోటీన్ల నిర్మాణంలో క్రయో ఎలక్ట్రానిక్స్ మైక్రోస్కోపీ పాత్ర పై వర్క్ షాప్

నిజామాబాద్, బతుకమ్మ :  తెలంగాణ విశ్వవిద్యాలయం బయోటెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ప్రోటీన్ల నిర్మాణ విశ్లేషణలో క్రయో ఎలక్ట్రాన్ మైక్రో స్కోపి పాత్ర అనే అంశం పై విభాగాధిపతి డాక్టర్ ప్రసన్న శీల అధ్యక్షతన వర్కుషాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్ ప్రారంభకులుగా కళాశాల ప్రధానాచార్యులు, ఆచార్య సిహెచ్ ఆరతి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ మా ఊరపు సత్యనారాయణ రెడ్డి హాజరయ్యారు. ఈ వర్క్ షాప్ కు కీలక ఉపన్యాసకర్త గా అమెరికా నార్త్ కరోలిన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ సైన్సెస్ డిప్యూటీ డైరెక్టర్ డా.వెంకట ప్రసాద్ దాండ్లి హాజరై ప్రోటీన్ల నిర్మాణ విశ్లేషణలో క్రయో ఎలక్ట్రానిక్ మైక్రోస్కోపీ ఉపయోగాలను తెలిపారు. ప్రోటీన్ల ఛాయాచిత్రాలను తెలుసుకోవడం ద్వారా వ్యాధి నిరోధక శక్తిని పెంచే అనేక రకాలైన డ్రగ్స్ ను సులభంగా తయారు చేయవచ్చని విషదీకరించారు. పరిశోధక విద్యార్థుల కు తక్కువ ఖర్చుతో క్రయో ఎలక్ట్రాన్ ను ఉపయోగించి ఉపాధి అవకాశాలు ఎలా సృష్టించుకోవాలో తెలియజేశారు. నిజజీవితంలో క్రయో ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ ఉపయోగాలపై విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమగ్రంగా సమాధానమిచ్చారు. అభివృద్ధి చెందుతున్న భారత దేశంలో క్రయో ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ ని విస్తృతంగా వాడవచ్చునని దీని ఉపయోగం వలన ఆరోగ్యకరమైన దేశాన్ని నిర్మించవచ్చునని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బయోటెక్నాలజీ, బోటనీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫార్మాసూటికల్ కెమిస్ట్రీ ఆచార్యులు డాక్టర్ ప్రవీణ్ మామిడాల, డాక్టర్ మహేందర్ రెడ్డి, డాక్టర్ కిరణ్మయి, డాక్టర్ వాసం చంద్రశేఖర్, డాక్టర్ బోయపాటి శిరీష,డా. ప్రసన్న తో పాటు విశ్వవిద్యాలయ ఆచార్యులు పాల్గొన్నారు.

Workshop on the Role of Cryo-Electronic Microscopy in the Structure of Proteins