సూపర్ బ్రెయిన్ యోగ అంశంపై కార్యశాల

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : దక్షిణ గోవా మడగాం లోని  శ్రీ దామోదర విద్యాలయ ఇంగ్లీష్  ఉన్నత పాఠశాలలో రాష్ట్ర అవార్డు గ్రహీత, ఇటీవల గుంజీళ్ళ జాతీయ ప్రచారకులుగా  ప్రసిద్ధి గాంచిన అందె జీవన్ రావు "సూపర్ బ్రెయిన్ యోగ" అంశంపై కార్యశాల నిర్వహించారు.  మన దేశంలో పాఠశాలలలో విద్యార్ధులచే గుంజీలు తీయించడాన్ని శిక్షగా పరిగణించడం వలన ఈ పద్ధతి కనుమరుగవుతున్న తరుణంలో గుంజీలు తీయడం అనేది పాశ్చాత్య దేశాలలో "సూపర్ బ్రెయిన్ యోగ" అనే ఆధునిక పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చిందని అందె జీవన్...