రోబోటిక్స్ పై కార్యశాల

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని గిరిరాజ్ కళాశాల(స్వ)లోని భౌతికశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో సోహం అకాడమీ, హైదరాబాద్ వారి సౌజన్యంతో రోబోటిక్స్ పై ఒకరోజు కార్యశాల నిర్వహించారు.  కార్యశాలను ప్రారంభిస్తూ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్  డాక్టర్ ఎస్.రంగరత్నం మాట్లాడుతూ నేడు అన్ని రంగాలలో రోబోటిక్స్ చాలా ప్రాధాన్యత సంతరించుకుందని, భవిష్యత్తులో  దాదాపు మన అన్ని దైనందిన కార్యక్రమాలలో రోబోల వాడకం సర్వసాధారణమవుతుందని తెలిపారు. ఈ కార్యాశాలలో 70 మంది విద్యార్థులు శిక్షణ పొందగా, ట్రైనర్లుగా సోహం అకాడమీ ప్రతినిధులు సందీప్, మల్లికార్జున్, రాజ వర్ధన్, అక్షయలు...