ఎఫెక్టివ్ రైటింగ్ స్కిల్స్ పై కార్యశాల

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల  ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం "ఎఫెక్టివ్ రైటింగ్ స్కిల్స్"అనే అంశంపై కార్యశాలను నిర్వహించారు. ప్రిన్సిపాల్ డా. పి. రామ్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆంగ్లభాష పై పట్టు సాధిస్తే ఉపాధి అవకాశాలు అందుకోవడమే కాదు, ఎక్కడా ఆత్మన్యూనత భావనకు గురికాకుండా గౌరవించబడుతామని అన్నారు. విద్యార్థులకు రాత నైపుణ్యం పై అవగాహణ కలిగించడం కోసం ఈ అంశాన్ని ఎన్నుకున్నామని కార్య శాల సమన్వయకర్త, మరియు ఆంగ్ల శాఖాధిపతి డా. ఐ. గంగాధర్ వివరించారు. ప్రధాన వక్తలుగా...