Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 March 2025, 3:43 pm Posted by : ramakrishna

ఎఫెక్టివ్ రైటింగ్ స్కిల్స్ పై కార్యశాల

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల  ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం “ఎఫెక్టివ్ రైటింగ్ స్కిల్స్”అనే అంశంపై కార్యశాలను నిర్వహించారు. ప్రిన్సిపాల్ డా. పి. రామ్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆంగ్లభాష పై పట్టు సాధిస్తే ఉపాధి అవకాశాలు అందుకోవడమే కాదు, ఎక్కడా ఆత్మన్యూనత భావనకు గురికాకుండా గౌరవించబడుతామని అన్నారు. విద్యార్థులకు రాత నైపుణ్యం పై అవగాహణ కలిగించడం కోసం ఈ అంశాన్ని ఎన్నుకున్నామని కార్య శాల సమన్వయకర్త, మరియు ఆంగ్ల శాఖాధిపతి డా. ఐ. గంగాధర్ వివరించారు. ప్రధాన వక్తలుగా విచ్చేసిన తెలంగాణయునివర్సిటీ ప్రొఫెసర్  డా.కె.వి.రమణాచారి,ఏ  భాషనైన అర్థవంతంగా దోషాలు లేకుండా చెప్పగలిగితే, రాయగలిగితేనే ఎదుటివారికి సరైనా అర్థం, భావం అందుతుంది. లేదంటే అపార్థాలు, గందరగోళం ఏర్పడుతాయని అన్నారు. అందుకొరకు శ్రవణం, భాషణం, చదవడం, రాయడం నైపుణ్యాలు నేర్చుకోవాలని సూచించారు.   డా. పి. సమత, మరియు  ప్రత్యేక అతిథి డా.ఎస్. జాన్ సుకుమార్,   డా.వి.శ్యామ్ కుమార్ లు భాషానైపుణ్యాలలోని మెళకువలను వివరించారు. ఈ కార్యక్రమంలో  కార్యశాల నిర్వాహణ కార్యదర్శి, పి.ఆర్.ఓ. డా. దండు స్వామి,  వైస్ ప్రిన్సిపాల్ ఎస్. రంగరత్నం,   పరీక్షల నియంత్రణాధికారి కె. భరత్ రాజ్,  ఐ క్యూ. ఏ.సి. కో – ఆర్డినేటర్  డా. ఏ. రాజేష్, వివిధ విభాగం అధిపతులు వినయ్ కుమార్, డా. రామస్వామి, డా. రామకృష్ణ, రాహుల్, అధ్యాపకులు నాగజ్యోతి, ప్రతిభ, దస్తప్ప, లావణ్య, రాజశేఖర్, నిఖిత్ పాతిమా , జాదవ్ వసంత్,  స్థితప్రజ్ఞ, మరియు కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Workshop on Effective Writing Skills