మత్తు పదార్థాల నిరోధానికి కలిసికట్టుగా కృషి
నషా ముక్త్ భారత్ అభియాన్ జిల్లా కమిటీ సమావేశంలో కలెక్టర్ నిజామాబాద్, బతుకమ్మ : మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల నిరోధానికి కలిసికట్టుగా కృషి చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం కలెక్టర్ అధ్యక్షతన నషా ముక్త్ భారత్ అభియాన్ జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులు, కమిటీ ప్రతినిధులు పాల్గొని, జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగం,...