జిల్లాలో పని చేయడం గొప్ప అనుభూతిని అందించింది
అందరి సహకారంతోనే నిజామాబాద్ ను ముందంజలో నిలుపగలిగాం వీడ్కోలు సమావేశంలో బదిలీపై వెళ్తున్న కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడి ఇదే ఒరవడితో ముందుకెళ్తామని నూతన కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి స్పష్టీకరణ నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ లో దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు విధులు నిర్వహించడం ఎంతో గొప్ప అనుభూతిని కలిగించిందని, జిల్లాతో ఏర్పడిన అనుబంధం ఎన్నటికీ మర్చిపోలేనిదని జిల్లా కలెక్టర్ గా పనిచేసి ఇటీవలే బదిలీ అయిన రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. ఆయన బదిలీపై వెళ్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని...