Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 April 2026, 8:26 pm Posted by : ramakrishna

అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి

 

మోర్తాడ్, బతుకమ్మ :

 

అణగారిన వర్గాల అభ్యున్నతికి తన జీవితాంతం పాటుపడిన మహనీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని శెట్ పల్లీ సర్పంచ్ పెగడ విజయ్ కుమార్ అన్నారు. అలాగే విద్యాభివృద్ధికి, బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగు నింపేందుకు పూలే చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. అనంతరం పూలే చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రవి, ఉప సర్పంచ్ సాయిరాం, ఉపాధిహామీ క్షేత్ర సహాయకుడు చంద్రమోహన్, కారోబర్ పృథ్వీరాజ్, అంగన్వాడి టీచర్ సుమలత, ఆశ వర్కర్లు లత, శ్యామల వార్డ్ మెంబర్లు, వివో ఏ వర లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.