Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 May 2026, 4:51 pm Posted by : ramakrishna

కూలీలకు ప్రమాద బీమా కల్పించాలి

 

. . . ఐద్వా జిల్లా కార్యదర్శి బెజ్గం సుజాత

 

ఆర్మూర్, బతుకమ్మ :

 

ఉపాధి హామీ కూలి చేసుకునే ప్రతి ఒక్కరికి లేబర్ కార్డులు ఇచ్చి ప్రమాద బీమా కల్పించాలని ఐద్వా జిల్లా కార్యదర్శి బెజ్గం సుజాత అన్నారు. ఆర్మూర్ మండల్ చేపూర్ గ్రామంలో ఐద్వా కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా మంగళవారం ఉపాధి హామీ కూలీలను కలిసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలకు పని ప్రదేశాల్లో భద్రత కల్పించాలని అన్నారు. అలాగే వేసవి కాలంలో ఎండలు విపరీతంగా ఉన్నందున కూర్చోవడానికి టెంట్ ఏర్పాటు చేసి, తాగడానికి మంచినీళ్లు ఏర్పాటు చేయాలన్నారు. అకస్మాత్తుగా పని ప్రదేశాల్లో ఎవరికైనా గాయాలు జరిగితే మెడికల్ కిట్టు సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి అల్లెపు వెంకటేష్, చేపూర్ ఐద్వా సభ్యులు గంగుభాయ్, సత్యమ్మ, రాజుభాయ్, అన్నపూర్ణ, బుజ్జవ్వ, చిట్టెమ్మ తదితరులు పాల్గొన్నారు.