కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
. . . సిఐటియు కామారెడ్డి జిల్లా కమిటీ డిమాండ్ కామారెడ్డి, బతుకమ్మ : ఆర్టిజన్ కార్మికులతో చర్చించి తక్షణమే వారి సమస్యలను పరిష్కరించాలని సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్ ముదాం అరుణ్ డిమాండ్ చేశారు. గురువారం నుంచి జిల్లా కేంద్రంలోని ఎస్ ఈ కార్యాలయం ముందు సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న ఆర్టీజన్ కార్మికులను ఆదివారం కలిసి మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్ఈబి సర్వీస్ రూల్స్ అమలు చేస్తామని, విద్యార్హతను బట్టి...