Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 April 2025, 7:52 pm Posted by : ramakrishna

అంకిత భావంతో క్రమశిక్షణతో కృషి చేయాలి

బతుకమ్మ,మోర్తాడ్: విద్యార్థులు ఉన్నత లక్ష్యలు నిర్దేశించుకోని, అంకితభావంతో, క్రమశిక్షణతో కృషి చేయడం వల్ల జీవితంలో ఉన్నత స్థాయిలో నిలబడతారని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పెద్దన్న అన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో బుధవారం వీడ్కోలు సమావేశం జరిగింది. మంచి ప్రతిభ చూపించిన విద్యార్థులకు ప్రశంస పత్రాలు అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ మర్రిపల్లి భూపతి, కోఆర్డినేటర్ దశరథ్, అధ్యాపకులు రాజయ్య, రవీందర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Work with dedication and discipline.