గ్రాడ్యుయేట్ బోర్డ్ ఏర్పాటుకు కృషి
స్వతంత్ర అభ్యర్థి పులగం దేవిదాస్ నిజామాబాద్, బతుకమ్మ : గ్రాడ్యుయేట్ బోర్డ్ ఏర్పాటుకు కృషి చేయడంతో పాటు ఉచిత విద్య, వైద్యం అందించేందుకు కృషి చేస్తానని మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి పులగం దేవిదాస్ అన్నారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రాడ్యుయేట్ బోర్డ్ స్వయం ప్రతిపత్తి సంస్థ ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. బోర్డులో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ల పాలనలో ప్రత్యేక అధికారాలతో పర్యవేక్షణకు కృషి...