లక్ష్యసాధన దిశగా కృషి చేయాలి
జిల్లా కోర్టు ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జ్ సునీత నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : విద్యార్థినులు ఉన్నత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆ దిశగా విద్యాభ్యాసం చేస్తూ సాధించాలని నిజామాబాద్ జిల్లా కోర్టు ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి సునీత కుంచాల అన్నారు. మంగళవారం అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జిల్లా న్యాయ సేవ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సమావేశానికి కళాశాల ప్రిన్సిపల్ బుద్దిరాజు అధ్యక్షత వహించగా, అతిథిగా జిల్లా...