Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 July 2026, 9:16 pm Posted by : ramakrishna

రహత్ నగర్‌లో నూతన విద్యుత్ సబ్‌స్టేషన్ పనులు వేగవంతం

 

. . . పవర్ ట్రాన్స్‌ ఫార్మర్ పీటింగ్ పూర్తి

 

భీంగల్, బతుకమ్మ :

 

పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ చొరవతో రహత్ నగర్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న నూతన విద్యుత్ సబ్‌స్టేషన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం పవర్ ట్రాన్స్‌ ఫార్మర్ పీటింగ్ పనులను అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. సబ్‌స్టేషన్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని, త్వరలోనే ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సబ్‌స్టేషన్ అందుబాటులోకి రావడంతో రహత్ నగర్‌తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కన్స్ట్రక్షన్ ఏడీఈ శ్రావణ్ కుమార్, కన్స్ట్రక్షన్ ఏఈ, ట్రాన్స్‌ఫార్మర్ ఏఈ సాయిలు, లైన్‌మన్ మోహన్, తోట రాజశేఖర్, స్థానిక సర్పంచ్ లకావత్ తిరుపతి, ఉప సర్పంచ్ భుక్య సేవలాల్, వీడీసీ సభ్యులు బాదావత్ గోపాల్, రాములు, గ్రామ పెద్దలు బాదావత్ బాలు, శర్మ నాయక్, మోహన్ నాయక్, రాములు, కాంట్రాక్టర్ రమేష్, సతీష్ రావు తదితరులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ లకావత్ తిరుపతి మాట్లాడుతూ, పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ ప్రత్యేక చొరవతో గ్రామానికి ఎంతో అవసరమైన విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం వేగంగా పూర్తవుతుండడం సంతోషకరమని తెలిపారు. త్వరలో సబ్‌స్టేషన్ ప్రారంభమైతే గ్రామ ప్రజలకు విద్యుత్ సమస్యలు గణనీయంగా తగ్గనున్నాయని ఆయన పేర్కొన్నారు.

 

Work on the new electricity substation in Rahat Nagar accelerated.