Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 September 2026, 4:56 pm Posted by : ramakrishna

కళా భారతి ఆడిటోరియం పనులను వేగవంతం చేయాలి

. . . కలెక్టర్ భవేష్ మిశ్రా

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ క్యాంప్ ఆఫీస్ స్థలంలో నిర్మిస్తున్నకళా భారతి ఆడిటోరియం పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. బుధవారం ఆయన ఆడిటోరియం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ వేడుకల కోసం అధునాతన సదుపాయాలతో గ్రౌండ్ ఫ్లోర్ సహా ఐదు అంతస్తులతో నిర్మిస్తున్న భవన సముదాయం పనుల వివరాల గురించి ఆర్ అండ్ బీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వేదిక, రెండు బ్యాంకెట్ హాల్స్, సుమారు 1400 మంది కూర్చునే సామర్థ్యంతో ఆడిటోరియం, ఆర్ట్ గ్యాలరీ పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఫ్రేమ్ వర్క్ పూర్తయినందున మిగతా పనులను కూడా వేగవంతంగా జరిపించాలని కలెక్టర్ సూచించారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం జిల్లా కేంద్రంలో సరైన వేదికలు లేనందున కళాభారతి ఆడిటోరియం పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించి అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, నాణ్యతతో జరిగేలా చూడాలన్నారు. పనుల ప్రగతిని ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని సూచించారు.

. . . ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి అనువైన స్థలాల పరిశీలన
అన్ని హంగులతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, వసతి గృహ సముదాయాల నిర్మాణాల కోసం ఎంపిక చేసిన స్థలాలను కలెక్టర్ భవేష్ మిశ్రా బుధవారం పరిశీలించారు. గుండారం గ్రామంతో పాటు, నాగారం నందిగుట్ట ప్రాంతాల్లోని స్థలాలను కలెక్టర్ పరిశీలించారు. సమగ్ర వివరాలతో ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఆర్ అండ్ బీ ఈ.ఈ ప్రవీణ్, రెవెన్యూ శాఖ, ఇంజినీరింగ్ విభాగం అధికారులు ఉన్నారు.

Work on the Kala Bharati Auditorium needs to be expedited.
Work on the Kala Bharati Auditorium needs to be expedited.