సైనికుల్లా పని చేయాలి
బిజెపి మండల శాఖ అధ్యక్షులు ఉప్పరి రమేష్ సభ్యత్వ నమోదు విజయవంతం చేయాలి బతుకమ్మ భిక్కనూర్: జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులు సైనికులుగా పనిచేయాలని బిజెపి పార్టీ మండల శాఖ అధ్యక్షులు ఉప్పరి రమేష్ పిలుపునిచ్చారు. ఆదివారం నాడు ఆయన భిక్కనూరు మండలం రామేశ్వర్ పల్లి గ్రామంలో గల మార్కండేయ ఆలయంలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కామారెడ్డి జిల్లా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్...