Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 September 2025, 6:20 pm Posted by : ramakrishna

పేద ప్రజల అభివృద్ధికి కృషి

మోర్తాడ్, బతుకమ్మ : పేద ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడు కృషి చేస్తుందని మార్కెట్ కమిటీ డైరెక్టర్ లక్మ రంజిత్ అన్నారు. మోర్తాడ్ మండలంలోని శెట్ పల్లీ గ్రామంలో నూతనంగా వచ్చిన 144 రేషన్ కార్డులను లబ్ధిదారులకు శుక్రవారం ఆయన చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. అర్హులై ఉండి రేషన్ కార్డు రానివారు నూతనంగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మోర్తాడ్ మండల యువజన అధ్యక్షుడు మనోజ్ కుమార్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆనంద్, డీలర్ విజయ్, నాయకులు లక్మ గంగాధర్, బిల్లాల శ్రీనివాస్, అజయ్ రెడ్డి, రాజు, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.