కమ్మర్ పల్లి, బతుకమ్మ: కమ్మర్ పల్లి మండల కేంద్రంలో కమ్మర్ పల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న వడ్ల కొనుగోలు కేంద్రాన్ని కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య , పాక్స్ చైర్మన్ రేగుంట దేవేందర్ , తహసీల్దార్ ఆంజనేయులు కలిసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య మాట్లాడుతూ ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం ప్రతీ ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని , అలాగే ఎన్నికల మేనిఫెస్టో లో చెప్పిన ప్రకారం సన్నపు వడ్లకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ ఇచ్చామని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని అన్నారు. ఇట్టి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిసర ప్రాంత రైతులు సద్వినియోగం చేసుకోవాలని, దళారులను నమ్మి తక్కువ రేటుకు ధాన్యాన్నిఅమ్ముకొని రైతులు నష్టపోవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు సుంకెట రవి,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సుంకెట బుచ్చన్న, పాక్స్ స్పెషల్ ఆఫీసర్ పోచయ్య, కమ్మర్ పల్లి తాజా మాజీ సర్పంచ్ గడ్డం స్వామి, డైరెక్టర్లు రెంజర్ల మహేందర్, విజయ్, గంగారెడ్డి, కార్యదర్శి రాజేశ్వర్, నాయకులు పూజారి శేఖర్, శైలెందర్, రైతులు గడ్డం నర్సారెడ్డి, కొమ్ముల రాజన్న పాల్గొన్నారు.