Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 October 2024, 5:39 pm Posted by : ramakrishna

వడ్ల కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

ఎమ్మెల్యే  మదన్ మోహన్ రావు

ఎల్లారెడ్డి, బతుకమ్మ :  పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో నాగిరెడ్డి పేట్ మండలంలోని తాండూర్ సొసైటీ పరిధిలోని ధర్మారెడ్డి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మదన్ మోహన్,  ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ తో కలిసి శనివారం ప్రారంభించారు. కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ మద్దతు ధరలు పోందాలని రైతులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలు లేకుండా రైతులకు మోసం జరగకుండా తూకం వేయాలని అన్నారు. రాబోయే రోజుల్లో ప్యాడి క్లీనింగ్ మిషన్ లు కొనుగోలు చేసి రైతులకు ఆసరా గా నిలుస్తామన్నారు. కొనుగోలు కేంద్రాలలో లలో ఎవరైనా అక్రమ వసూళ్లకు పాల్పడితే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తే సహించేది లేదు అని హెచ్చరించారు. రైతులు సంతోషంగా ఉంటే గ్రామాలు, రాష్ట్రాలు, మన దేశం సుభిక్షంగా ఉంటుంది అని అన్నారు. రైతులను ఇబ్బంది పెట్టిన వారిపైనా చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలి అని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకట్ రామ్ రెడ్డి, తాండూర్ సొసైటీ ఛైర్మన్, ఎల్లారెడ్డి ఏఎంసీ డైరెక్టర్లు, నాగిరెడ్డి పెట్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Wood buying centers should be utilized