Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 May 2025, 4:04 pm Posted by : ramakrishna

మహిళా సమైక్య జనరల్ బాడీ మీటింగ్

 బతుకమ్మ,ఏర్గట్ల :మండల మహిళా సమైక్య ఆఫీస్ లో అధ్యక్షురాలు వసంతమ్మ అధ్యక్షతన మండల సమైక్య జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీఎం శ్యామ్, మాట్లాడుతూ ఈ సంవత్సరం 2025 -26 లక్ష్యం సంఘాలు 321-1979.20 ( పంతోమ్మిది కోట్ల డెబ్భై లక్షల ఇరవై వెయ్యిలు ), స్త్రీనిధి 2025-2026 సంవత్సరానికి లక్ష్యం 377 మూడు కోట్ల డెబ్భై ఏడు లక్షల రూపాయలు  ఉన్నది ఈ లక్ష్యాన్ని 2025-2026 సం లో 100% సాధించాలని అదే విధంగా మహిళా శక్తి కార్యక్రమలను అందరూ మహిళలను అందించాలని ఏపిఎం చెప్పడం జరిగింది  అనంతరం కొత్త కమిటీ ఎన్నిక నిర్వహించారు. అధ్యక్షురాలిగా కుందేనా లక్ష్మి, కార్యదర్శి గా బైండ్ల సునీత, కోశాధికారి మోత్కూరి లత, ఎన్నికైనట్లు ఏపీఎం శ్యామ్ తెలిపారు. ఈ కార్యక్రమనికి సి సి సి లు సంతోష్, నవీన్, శ్రీనిధి మేనేజర్ సరస్వతి, అకౌంటెంట్ సుప్రియ,13 గ్రామ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.