Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 July 2025, 7:20 pm Posted by : ramakrishna

ఏర్గట్లలో మహిళా శక్తి సంబరాలు

బతుకమ్మ,ఏర్గట్ల : మండలంలో  ఐకెపి కార్యాలయం లో గ్రామ సంఘం అధ్యక్షురాలు లక్ష్మీ, అధ్యక్షతన మహిళా శక్తి సంబరాల్లో భాగంగా మంగళవారం రోజు మండల సమైక్య ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో  ఏపిఎం శ్యామ్ మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామ సంఘాలలో బుధవారం ప్రత్యేక గ్రామ సంఘం సమావేశాలు ఏర్పాటు చేసుకుని మండల సమైక్యా లోని అంశాలు చర్చించుకుని అమలు చేయాలని తెలియజేయడం జరిగింది. మండల సమైక్య సమావేశం లో చర్చించిన అంశాలు మిగిలిపోయిన అర్హత గల మహిళలను సంఘాలలో చేర్పించడం గ్రామాలలో వృద్ధుల సంఘాలు ఏర్పాటు చేయడం అర్హత గల దివ్యాంగులను సంఘాలుగా చేయడం అర్హత గల కిషోర బాలికలను సంఘాలుగా చేయడం ఆగిపోయిన సంఘాలను పునరుద్ధరణ చేయడం బ్యాంకు రుణాలు అందజేయడం భీమ క్లెముల ప్రమాద క్లెముల పరిష్కారం, వ్యవసాయ ఆధారిత జీవనోపాదులు పౌల్ట్రీ డైరీ ఫార్మ్స్ ని వ్యవసాయతర ఉపాధి అవకాశాలు స్కూల్ యూనిఫామ్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లో పెట్రోల్ పంపులు వీటిపై చర్చించడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల సంఘాల అధ్యక్షులు సిబ్బంది ఏపీఎం శ్యామ్ సీసీలు సంతోష్,నవీన్,అకౌంటెంట్ సుప్రియ, విఓఏ లు పాల్గొన్నారు.