Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 March 2026, 8:51 pm Posted by : ramakrishna

మహిళలను శ్రీమంతులు చేయడానికే మహిళా సంఘాలు

 

వేల్పూర్, బతుకమ్మ :

 

ప్రతి మహిళను లక్షాధికారిని చేయడానికే మహిళా సంఘాలు ఏర్పాటు చేయడం జరిగిందని టీఎన్జీవోస్ జిల్లా ఉపాధ్యక్షుడు బత్తుల మాణిక్యం అన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో సోమవారం మహిళా సమాఖ్య భవనంలో మహిళా దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. మహిళ సంఘాల అధ్యకులు కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు పంచుతూ సంబరాలు చేసుకున్నారు. మహిళలను ఆర్థిక అభివృధి లోనికి తీసుకెళ్లడానికి సెర్ప్ కృషి చేస్తుందని పేర్కొన్నారు. అలాగే మహిళలకు చదువు నేర్పడం కోసం ఉల్లాస్ వంటి కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు సరోజా, కార్యదర్శి విజయ లక్ష్మీ, ఉప అధ్యక్షురాలు లలిత, సీసీ లు సరళ, వెన్న మురళీ, సాయన్న, సునీత, మహిళా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

Women's organizations are there to make women rich.