గ్రామ సంఘాలతో మహిళల అభివృద్ధి
బతుకమ్మ, పిట్లం : పిట్లం మండలంలోని మార్దండ గ్రామ సంఘం జనరల్ బాడీ సమావేశం శుక్రవారం నిర్వహించి నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు. అధ్యక్షురాలుగా వాసరి సావిత్రి, కార్యదర్శిగా వాసరి విజయ, కోశాధికారిగా దయ్యాల అంబవ్వ, ఉపాధ్యక్షురాలు మున్నూరు శోభ, సహాయ కార్యదర్శి రొట్టెల రత్నవ్వలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి సీసీ ఉత్తమ్, వివో ఏ రవీందర్, 24 సంఘాల సభ్యులు పాల్గొన్నారు.