Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 March 2026, 5:00 pm Posted by : ramakrishna

మహిళల్లో అభ్యుదయం కోసమే మహిళా దినోత్సవం

 

. . . అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా సెమినార్ నిర్వహించిన టీఎస్ఏ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

హిళల్లో అభ్యుదయానికై, మార్పులకై పోరాటం కోసమే మహిళా దినోత్సవం జరుపుకుంటామని తెలంగాణ స్టూడెంట్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి జ్వాల అన్నారు. మాణిక్ బండార్ లోని కాకతీయ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కార్యదర్శి జ్వాల అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షులు కిరణ్, విమెన్స్ ఎస్ఐ భరోసా ఇంచార్జ్ పుష్పవతి, భరోసా సెంటర్ కోఆర్డినేటర్ రోజా, లీగల్ అడ్వైజర్ భరోసా డయానా గీతిక, డాక్టర్ ప్రతిమరాజ్, అస్త్రజబిన్, హెచ్ ఓ డి సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మానస, ఫ్యాకల్టీ ఈసీఈ డిపార్ట్మెంట్ అనూష, ఫ్యాకల్టీ ఈసీఈ డిపార్ట్మెంట్ హాజరయ్యారు. విద్యార్థినిలను, మహిళలను ఉద్దేశించి వీరందరూ కూడా అవగాహన కల్పించారు. ప్రస్తుతం భవిష్యత్ వర్తమానాలపైన ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితుల పైన భవిష్యత్తులో తీసుకోవాల్సిన నిర్ణయాల పైన మానసిక దృఢత్వం పైన, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి సందేశం అందజేశారు.

 

Women's Day is for the advancement of women.

 

మహిళా దినోత్సవం అంటే మహిళల్లో చైతన్యం తీసుకురావడమని, గతంలో మహిళలు ఎదుర్కొన్నటువంటి దుర్గతిని గుర్తు చేస్తూ ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్నటువంటి సమాజంలో జరుగుతున్నట్టువంటి మార్పులను తెలియజేశారు. అలాగే విద్యార్థి దశ సరైనదిగా ఉంటే జీవితాలు సరైనదిగా ఉంటాయని, మహిళలు జీవితంలో రాణించాలంటే చదువు తప్పనిసరని, ప్రతి ఒక్కరిని చదువుకునేందుకు ప్రోత్సహించాలని అది మనందరి కనీస బాధ్యతని ఈ సెమినార్ ద్వారా తెలియజేశారు. మహిళా అభివృద్ధి జరిగినప్పుడే సమాజంలో ప్రగతి అనేది సాధ్యమని, కాబట్టే ఈ రోజున ఈ సమావేశాన్ని నిర్వహించామని, ఈ సెమినార్ కి సహకరించినటువంటి అందరికీ (టీఎస్ఎ) తెలంగాణ స్టూడెంట్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా కమిటీగా పేరుపేరునా విప్లవ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేఘన, నికిత, అర్చన, శివ తదితరులు పాల్గొన్నారు.

 

Women's Day is for the advancement of women.