Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 July 2025, 8:03 pm Posted by : ramakrishna

మహిళా రుణాలను వినియోగించుకొని ఆర్థికంగా ఎదగాలి

  • ఏపీఎం మాణిక్యం

 

వేల్పూర్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్ధిక సాధికారత కోసం ఇస్తున్న మహిళా సంఘాల ఋణలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని ఐకెపీ ఏపీఎం మాణిక్యం అన్నారు. బుధవారం మండలంలోని పడిగల్ గ్రామంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలను నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామ సంఘాలకు అధ్యక్షులుగా పని చేసిన వారిని ఘనంగా సన్మానించారు.ఈ సందర్బంగా ఏపీఎం మాట్లాడుతూ ప్రభుత్వం ఇస్తున్న శ్రీనిధి, వడ్డీ లేని ఇతర బ్యాంక్ ఋణలను అవగాహన, ఆలోచనతో పెట్టుబడి పెట్టి ఆర్ధిక స్వాలంబన పొందాలన్నారు.గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క జన్మదినాన్ని పురస్కరించుకొని పేద మహిళకు నిత్యవసర సరుకులను అందజేశారు.ఈ కార్యక్రమంలో సీసీలు ఎడెల్లి రవి వెన్న మురళి గ్రామ సంఘాల కార్యవర్గ సభ్యులు వివోఏలు పాల్గొన్నారు.