Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 March 2026, 6:18 pm Posted by : ramakrishna

మహిళలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

 

. . . నిజామాబాద్ మేయర్ ఉమారాణి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్, నిజామాబాద్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ మేయర్ ఉమారాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

 

Women should take special care of their health

 

ఈ సందర్భంగా మాట్లాడిన మేయర్ ఉమారాణి మహిళలు కుటుంబం, సమాజానికి బలమైన ఆధారమని పేర్కొన్నారు. కుటుంబ ఆరోగ్యం, పిల్లల భవిష్యత్తు, సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని ఆమె అన్నారు. మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అలాగే ఆధునిక వైద్య సదుపాయాలతో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్న మెడికవర్ హాస్పిటల్స్ అందిస్తున్న సేవలను మహిళలు, ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళల ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించడంతో పాటు వైద్యులు మహిళలు ఎదుర్కొనే వివిధ ఆరోగ్య సమస్యలపై సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళ సిబ్బంది ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, మహిళా సిబ్బంది పాల్గొన్నారు.

 

Women should take special care of their health